వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొణతాల నో: పూరీ జగన్నాథ్‌పై జగన్ పార్టీ ఒత్తిడి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konathala Ramakrishna-Puri Jagannath
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, ఆయన సోదరుడు ఉమా శంకర్ గణేష్‌లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ సతీమణి లావణ్యను వచ్చే ఎన్నికల బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పూరీ సినిమాల్లో బిజీగా ఉన్నందున స్వయంగా ఆయన పోటీ చేసే అవకాశాలు లేకపోవడంతో ఆయన భార్యను బరిలోకి దింపాలనే యోచనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉందని అంటున్నారు.

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లోక్‌సభ లేదా నర్సీపట్నం అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి పూరీ జగన్నాథ్ కుటుంబ సభ్యులకు ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అనకాపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో కాపు సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉంటారు. పూరీది అదే సామాజిక వర్గం. దీంతో అక్కడి నుండి ఆయన కుటుంబ సభ్యులను దింపితే బాగుంటుందని జగన్ పార్టీ భావిస్తోందట. అక్కడి నుండి పూరి భార్య లావణ్యను దింపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. అయితే ఆయన అందుకు సిద్ధంగా లేరట. అనకాపల్లి లేదా యలమంచిలి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారట. దీంతో అనకాపల్లి నుండి పోటీ చేసేందుకు జగన్ పార్టీ మంచి అభ్యర్థి కోసం వెదుకుతోందట. వారికి పూరీ కుటుంబం కనిపించిందని అంటున్నారు.

అనకాపల్లి ఎంపీగా సతీమణి లావణ్యను పోటీ చేయించాలని పూరీ జగన్నాథ్‌ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కోరుతున్నారట. పూరీ సోదరుడు నర్సీపట్నం టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే పూరీ సతీమణిని ఎంపీ అభ్యర్థిగా దింపితే ఏడెనిమిది నియోజకవర్గాలలో ఆ ప్రభావం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోందట. అందుకే తమ్ముడికి నర్సీపట్నం టిక్కెట్ కంటే పూరీ సతీమణి లావణ్యకు అనకాపల్లి టిక్కెట్ ఇవ్వడమే మంచిదని భావిస్తున్నారట.

English summary
It is said that YSR Congress is thinking to give Anakapalli MP ticket to director Puri Jagannath's wife Lavanya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X