రేణుకా చౌదరి తెలంగాణ కార్డు

అప్పటికే తెలంగాణకు చెందిన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు డి. నాగేందర్, ముఖేష్ గౌడ్, కాంగ్రెసు శాసనసభ్యుడు జయప్రకాష్ రెడ్డి రేణుకా చౌదరి నివాసంలో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును తాను దీటుగా ఎదుర్కుంటానని కూడా రేణుకా చౌదరి ఆజాద్‌కు హామీ ఇచ్చారని తెలుస్తోంది. తాను 20 ఏళ్ల పాటు తెలంగాణ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, అందువల్ల తనను తెలంగాణకు చెందిన నేతగా తీసుకుంటారని ఆమె నమ్మబలికే ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు. పదవికి ఏ కార్డు అవసరమైతే ఆ కార్డు వాడుతారనే విషయానికి రేణుకా చౌదరి మినహాయింపేమీ కారని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications