షర్మిల జర్మనీ బూట్లు, నారా లోకేష్‌పై ఉతుకుడు

Nara Lokesh -Sharmila
హైదరాబాద్: సందు దొరికితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గానీ, ఆయన మీడియా గానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉతికి ఆరేయడానికి కాచుకుని కూర్చుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌పై కూడా అంతే దూకుడుగా సాక్షి మీడియా దుమ్మెత్తిపోసింది. పార్టీలో కొత్తగా చక్రం తిప్పుతున్న చిన్నబాబు ఇస్తున్న సలహాలు చూసి ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారని సాక్షి దినపత్రిక ఆ గాసిప్ న్యూస్‌ని అచ్చేసింది.

వైయస్ జగన్ సోదరి షర్మిల జర్మనీ నుంచి తెచ్చుకున్న బూట్టతో పాదయాత్ర చేస్తున్నారని, అందులో వేగంగా నడిచేందుకు పనికి వచ్చే పరికరం ఉందని తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఒకామె ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన నేతల పడీపడీ నవ్వుకుంటున్నారని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది. ఇంతకీ ఈ విషయంపై మాట్లాడాలని చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఆ మహిళా నేతకు చెప్పారనేది సాక్షి దినపత్రిక ఆంతర్యం.

ఆ వార్తాకథనంలోనే సాక్షి దినపత్రిక మరో విషయాన్ని కూడా చేర్చింది. ఆ విషయం నారా చంద్రబాబు నాయుడిపైన. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి కోటి రూపాయలు ఎంతో కూడా తెలియదని, జగన్ లక్ష కోట్లు తిన్నాడని మనమంటే ఏదో తిన్నాడని అనుకుంటారని, జగన్ దోచుకున్న డబ్బు వంద రూపాయల్లోకి మారిస్తే అవి వేయి లారీలకు సరిపోతాయని వివరిస్తే బాగా అర్థమవుతుందని చంద్రబాబు అన్నారని, ఇది విని తెలుగు తమ్ముళ్లు విస్తుపోయారని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.

చంద్రబాబుకు అలా చెప్పాలని సలహా ఇచ్చింది కూడా చిన్నబాబు నారా లోకేషేనని సాక్షి దినపత్రిక తేల్చేసింది. జనం భాషలోనే జగన్‌పై విమర్శలు చేయాలంటూ నారా లోకేష్ తండ్రికే కాకుండా పార్టీ నాయకులకు కూడా నారా లోకేష్ పూసగుచ్చినట్లు చెబుతున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+