ప్రధానితో బాబు: 5నిమిషాలంటూ సాక్షి మరో బాంబు

Manmohan Singh - Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి చిదంబరంతో రహస్యంగా భేటీ అయ్యారని, అదెంటో చెప్పాలని కొద్ది రోజుల క్రితం ఆరోపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దిన పత్రిక సోమవారం మరో బాంబు పేల్చింది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని, ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ఐదు నిమిషాలు సీక్రెట్‌గా భేటీ అయ్యారని, బిసి డిక్లరేషన్ పేరిట ఢిల్లీ యాత్రలో రహస్య అజెండా అమలు చేసినట్లుగా కనిపిస్తోందని సాక్షి పేర్కొంది.

గత కొన్నాళ్లుగా రాష్ట్ర కాంగ్రెసుతో చెట్టాపట్టాల్ వేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ప్రధానితో ఏకాంత చర్చల ద్వారా జాతీయస్థాయిలోని కాంగ్రెసుతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారని సాక్షి పేర్కొంది. సెప్టెంబర్ 6వ తేది మధ్యాహ్నం 12.30 నిమిషాలకు టిడిపి సీనియర్ నేతల బృందంతో కలిసి బాబు ప్రధాని వద్దకు వెళ్లి బిసి డిక్లరేషన్‌పై వినతి ఇచ్చారు. ఈ సమయంలో 20 నిమిషాల అనంతరం టిడిపి నేతలకు బాబు సైగ చేసి బయటకు పంపారని, ఆ తర్వాత ప్రధానితో ఏకాంతంగా ఐదు నిమిషాలు చర్చలు జరిపారని సాక్షి పేర్కొంది.

టిడిపి నేతలు కూడా దీనిని ధృవీకరిస్తున్నారని, ప్రధానితో బాబు ఏం మాట్లాడారో తమకు తెలియదని అయితే లోపలి నుండి వచ్చేటప్పుడు మాత్రం బాబు సంతోషంగా కనిపించారని సదరు నేతలు చెప్పారని పేర్కొంది. తెలంగాణ అంశం, వైయస్‌ జగన్ కేసుల వ్యవహారంతో పాటు రాష్ట్రంలో భావి రాజకీయ అవసరాలు, మధ్యంతర ఎన్నికలు, కోల్‌గేటు దుమారం, రాష్ట్రంలో నాయకత్వ మార్పు తదితరాలపై ప్రధానితో బాబు చర్చించి ఉంటారని టిడిపి వర్గాలే చెబుతున్నాయని రాసింది.

ఏదో రహస్య అజెండా ప్రకారమే ప్రధానితో బాబు ఏకాంతంగా సమావేశమై ఉంటారని టిడిపి వర్గాల్లో కూడా వ్యక్తమవుతోందని, ప్రధాని రాజీనామా అంశంపై, మధ్యంతర ఎన్నికలపై ఆ సమయంలో బాబు చేసిన వ్యాఖ్యలు కూడా అనుమానాలను కలిగిస్తున్నట్లుగా అభిప్రాయపడింది. ఉప ఎన్నికలలో జగన్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం, సర్వేలు కూడా వైయస్సార్ కాంగ్రెసుకు అనుకూలంగా ఉండటం వంటి కారణాల వల్ల కాంగ్రెసు, టిడిపిలు కలిస్తే జగన్ పార్టీని ఎదుర్కోవచ్చుననే అభిప్రాయాన్ని ప్రధాని ముందు బాబు వ్యక్తం చేసి ఉంటారని చెబుతున్నారని రాసింది.

జగన్ కేసుల గురించి, మద్దతు గురించే మాట్లాడి ఉండవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారని పేర్కొంది. బాబు విషయంలో రాష్ట్ర కాంగ్రెసులోని మార్పు కనిపిస్తోందని, నలుగురు కాంగ్రెసు ఎంపీలు ఇటీవల బాబును కలిశారని, ఆ రెండు పార్టీలు కలిసి జగన్ పార్టీని ఎదుర్కొనే అంశంపై దృష్టి సారిస్తుండవచ్చునని పేర్కొంది. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత.. కాంగ్రెసు, టిడిపి పలు సందర్భాలలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపించింది. బాబు కూడా కాంగ్రెసును ఆదుకుంటున్నారని పేర్కొంది. రెండున్నరేళ్లుగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెసు నేతలతో బాబు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని.. తాజాగా ప్రధాని భేటీలోనూ ఏదో కీలకాంశం ఉండి ఉంటుందని భావిస్తున్నారని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+