షర్మిలకు ఆదరణ: జగన్‌పార్టీ జీర్ణించుకోలేదా?

YS Jagan - Sharmila
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వస్తున్న ఆదరణను ఆ పార్టీ జీర్ణించుకోలేకపోయిందా? అంటే ప్రజల నుండి అలాంటి వాదనలే వినిపిస్తున్నాయంటున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి నేత ఒకరు. మంగళవారం ఓ టీవీ ఛానల్ కార్యాక్రమంలో తెరాస నేత ఒకరు ఈ వ్యాఖ్యలు చేశారు.

షర్మిల పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందని.. దీనిని జీర్ణించుకోలేకనే ఆమె పాదయాత్రను ఆపేందుకు ప్రయత్నాలు చేశారని ప్రజలు అనుకుంటున్నారని, అవి తన వ్యాఖ్యలు కాదని సదరు నేత వివరణ ఇచ్చారు. అందులో నిజమెంతో అబద్దమెంతో తనకు తెలియదని ప్రజల్లో ఉన్న వాదనను తాను చెప్పానన్నారు. షర్మిలకు ప్రజల్లో క్రమంగా ఆదరణ పెరుగుతోందని పాదయాత్రను ఆపించే కుట్ర జరిగినట్లుగా వినిపిస్తోందన్నారు.

అందుకు మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. షర్మిలకు ప్రస్తుతం జరిగిన ఆపరేషన్ డ్రామా అంటారా అని ప్రశ్నించారు. అయితే అందుకు ఆ తెరాస నేత.. తాను ప్రస్తుతం షర్మిలకు జరుగుతున్న ఆపరేషన్‌ను డ్రామాగా చెప్పడం లేదని... కానీ షర్మిలమ్మకు వస్తున్న ఆదరణ చూడలేక విత్ డ్రా చేయించే ప్రయత్నాలు జరిగాయనే వాదనలు మాత్రం వినిపించాయని తాను చెబుతున్నానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+