11 కోట్లు అప్పిచ్చి...: సూరీడుకు 'టిడిపి' ఝలక్

అతను ఈ ఫ్యాక్టరీని రు.7.50 కోట్లకు దక్కించుకున్నాడు. ఖుషి ఎరువుల ఫ్యాక్టరీ లోకాద్రి నాయుడుకు చెందినది. అతను రిలయన్స్ సంస్థకు తిరుమలలో పిఆర్‌వోగా వ్యవహరిస్తూ దివంగత వైయస్ హయాంలో టిటిడిలో చక్రం తిప్పారు. అతను పలువురి నుండి అప్పులు చేసి ఆ తర్వాత తీర్చలేక పోయాడు. ఐపి ప్రయత్నం చేసినప్పటికీ కోర్టు తిరస్కరించింది. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లాడు.
దీంతో లోకాద్రికి చెందిన ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ.14.6 కోట్లు అప్పిచ్చిన ఆంధ్రాబ్యాంక్ ఫ్యాక్టరీని సీచ్ చేసి వేలం నోటీసు ఇచ్చింది. లోకాద్రికి అప్పిచ్చిన వారిలో సూరగీడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అతను రూ.11 కోట్లు ఇచ్చారట. తనకు ఇచ్చే మొత్తం కింద ఎరువుల ఫ్యాక్టరీని తీసుకునే ప్రయత్నాలు చేసినా బ్యాంక్ తనఖాలో ఉండటంతో కుదరలేదు. గురువారం బ్యాంక్ ఎరువుల ఫ్యాక్టరీ వేలం నిర్వహించింది.
ఆంధ్రా బ్యాంక్ వద్ద జరిగిన వేలంలో సూరీడు, ఆయన తనయుడు, అనుచరులు పాల్గొన్నారు. అయితే సూరీడు ప్రత్యక్షంగా అక్కడకు వెళ్లకుండా ఓ అతిథి గృహంలో బస చేసి కుమారుడి ద్వారా ఫ్యాక్టరీని దక్కించుకునే ప్రయత్నాలు చేశాడు. సూరీడు కుమారుడు బ్యాంకు అధికారులను సంప్రదిస్తుండగా, మీడియాకు తెలిసి అక్కడికి రావడంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. తన అనుచరుల సాయంతో సీల్డ్‌టెండరులో ఎవరు పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఫ్యాక్టరీ వేలం పాటలో పాల్గొనడానికి 18 మంది దరఖాస్తులు తీసుకోగా అందులో ఇద్దరు మాత్రమే టెండర్లలో పాల్గొన్నారు. వీరిలో ఒకరు సూరీడు కుమారుడు కిరణ్ కాగా, మరొకరు టిడిపి నాయకుడు హరిబాబు తమ్ముడు గిరి. చివరికి దీనిని గిరి దక్కించుకున్నాడు. సూరీడు అనుచరులు రూ. 7.25 కోట్లు కోట్ చేయగా, పేరం హరిబాబుకు చెందిన జీజీఆర్ హౌసింగ్ సంస్థ రూ. 7.50 కోట్లు కోట్ చేసింది. దీంతో సూరీడుకు చుక్కెదురయింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications