లోకేష్ దమ్మున్న లీడర్: టిడిపి ఉక్కిరి బిక్కిరి

Nara Lokesh
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పైన ఆ పార్టీ నేతలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. వివిధ సందర్భాలలో నారా లోకేష్ స్పందన పట్ల కింది స్థాయి నేతల నుండి మొదలుకొని ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ బహిరంగంగా ఇప్పటి వరకు ఎవరిని విమర్శించిన దాఖలాలు లేవు. ఏ పార్టీపై ఆరోపణలు చేసిన సందర్భాలు లేవు.

ఆయన కేవలం ట్విట్టర్ ద్వారా విపక్షాలపై నిప్పులు చెరుగుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీ నేతలకు నిన్నటి వరకు లోకేష్ ట్విట్టర్‌లో పలు ప్రశ్నలు సంధించారు. తాజాగా అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించడంతో ఇతర పార్టీల నుండే కాకుండా తెలంగాణవాదుల నుండి ప్రశంసలు వస్తున్నాయి.

తెలంగాణ టిడిపి నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో లోకేష్ ట్విట్టర్‌లో హరీష్ రావు అటెండర్ పోస్టు దరఖాస్తు కోసం ఎన్టీఆర్ భవనం ఎదురు చూస్తోందని, కెటిఆర్ రాజీనామా ఎప్పుడో చేస్తారోనని పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు. ఆ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. లోకేష్ వ్యాఖ్యల్ని తెరాస నేతలు లైట్‌గా తీసుకున్నట్లు కనిపించినప్పటికీ కొద్దిగా ఇబ్బంది పడ్డారనే చెప్పవచ్చు!

ఇలా సందర్భానుసారంగా లోకేష్ బహిరంగంగా కాకపోయినా ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని పోస్టు చేసి విపక్షాలపై ఎదురుదాడికి దిగడాన్ని టిడిపి నేతలకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఆయన ట్వీట్ చేస్తున్న అంశాలు పలువుర్ని ఆలోచించే విధంగా ఉంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నిత్యం ఇంటర్నెట్‌తో కాలక్షేపం చేసే యువతను అవి ఆకట్టుకుంటున్నాయని వారు భావిస్తున్నారు.

ఆయన వ్యాఖ్యలు కూడా ఇతర పార్టీలను ఇరుకున పెట్టేలా ఉంటున్నాయని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం లోకేష్ ట్విట్టర్‌లో చేసిన ట్వీట్లు పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాయని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. లోకేష్ దమ్మున్న నేత అని, మంచి ప్రజ్ఞాశాలి అని అందుకే సందర్భానుసారంగా ట్వీట్ చేస్తున్నారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+