అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిఆర్ఎస్ స్ట్రాటజీ ఫాలో అవుతున్న టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గం నేతల రాజీనామాతో ఖాళీ అయిన పద్దెనిమిది నియోజకవర్గాలలో జరగనున్న ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అప్పుడే దృష్టి సారించింది. అయితే ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారని అంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో తెరాస ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా జూపల్లి కృష్ణా రావు, తాటికొండ రాజయ్య, గంపా గోవర్ధన్, పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితర నేతలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ లబ్ధి పొందిన విషయం తెలిసిందే.

ఇటీవల జరిగిన ఆరు నియోజకవర్గాల ఉప ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ తన ఆపరేషన్ ఆకర్ష్ దూకుడును పెంచిందని అంటున్నారు. ఇందులో భాగంగా మరికొందరు తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెసు, టిడిపిలకు చెందిన నేతలు ఆ పార్టీలో చేరేందుకు క్యూలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే ఆపరేషన్ ఆకర్ష్‌ను టిడిపి రాయలసీమ ప్రాంతంలో జరగనున్న అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గంలో కాస్త తిరగేసి అనుసరిస్తోందని అంటున్నారు.

ఆ నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు ఉప ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారట. గతంలో పార్టీ నుండి బయటకు వెళ్లిన నేతలను రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. అదే సమయంలో తటస్థులను, ఇతర పార్టీలోని అసంతృప్తులతో తమ వైపుకు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారట.

పార్టీలోని అసంతృప్తుల పైన కూడా తెలుగు తమ్ముళ్లు ఓ కన్ను వేశారట. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశ్యంతో నేతల డిమాండ్ల పైన హామీలు కూడా ఇస్తున్నారట. మరి అనంతలో తమ్ముళ్ల ఆపరేషన్ ఆకర్ష్ ఎంత వరకు సఫలమవుతుందో చూడాలి.

English summary
It seems, Telugudesam Party is following Telangana Rastra Samithi (TRS) strategy in Ananthapur. TDP leaders are trying to attract neutral leaders and other parties leaders in abid to win bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X