వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెండూల్కర్ తలుచుకుంటే ఎన్నేళ్లయినా...

By Pratap
|
Google Oneindia TeluguNews

Sachin Tendulkar
అహ్మదాబాద్: ఇంగ్లాండుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో కూడా విఫలమైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరో రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు అంటి పెట్టుకునే ఉండాలని అనుకుంటున్నాడట. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ జరుపుకోవాలని అతను ఇప్పటికే ఓ పథకం వేసుకున్నట్లు చెబుతున్నారు. దీన్ని బట్టి టెండూల్కర్‌కు వ్యక్తిగత రికార్డులపై ఎంత మోజు ఉందో అర్థమైపోతోంది.

అదొక్కటే కాదట. వచ్చే ప్రపంచ కప్ పోటీల్లో కూడా ఆడాలని టెండూల్కర్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఆ రకంగా ఏడు ప్రపంచ కప్ పోటీల్లో ఆడిన రికార్డు కూడా సొంతం చేసుకోవాలని కలలు కంటున్నాడని చెబుతున్నారు. ఇప్పటి వరకు 1972 నుంచి మొదలు పెడితే ఆరు ప్రపంచ కప్ పోటీల్లో ఆడి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియందాద్ రికార్డును సమయం చేశాడు. మరో ప్రపంచ కప్‌లో ఆడితే తాను రికార్డు సాధించినట్లు అవుతుందని భావిస్తున్నాడని అంటున్నారు.

మరో రెండేళ్ల పాటు తాను అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడాలంటే అన్ని మ్యాచులూ, అన్ని సిరీస్‌లూ ఆడకూడదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. టెస్టు మ్యాచులు ఎక్కువగా ఆడుతూ, వన్డే మ్యాచులను తగ్గించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్వంటీ20 మ్యాచుల నుంచి మాత్రం అతను అనధికారికంగా తప్పుకున్నట్లేనని అంటున్నారు.

అయితే, అన్ని ఫార్మాట్ల నుంచి ఒకేసారి తప్పుకుంటూ మరో రెండేళ్ల తర్వాత ప్రకటన చేయాలని సచిన్ టెండూల్కర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. పార్లమెంటు సభ్యుడు కూడా అయిన సచిన్ టెండూల్కర్, క్రికెట్ దేవుడిగా మన్ననలు అందుకున్న టెండూల్కర్ తలుచుకుంటే ఎన్నేళ్లకైనా కొదువ లేదని అంటున్నారు. అతన్ని కాదనే వారున్నారా అని అడిగితే జవాబు ఉండదు.

English summary
It is said that master blaster Sachin Tendulkar wants to continue in international cricket two more years to celebrate silver jubilee. He completed 23 years with November 15 in his international career.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X