కోదండపై అలిగి వెళ్లిన తెరాస నేతలు!

Kodandaram
తెలంగాణ కవాతు కోసం నెక్లెస్ రోడ్డుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, ఎమ్మెల్యేలు వేదిక పైనుండి అలిగి వెళ్లినట్లుగా జోరుగా వార్తలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ, న్యూడెమోక్రసీ, సిపిఐ, తెరాసతో సహా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీగా తెలంగాణవాదులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో నెక్లెస్ రోడ్డుకు తరలి వచ్చారు. కవాతు ప్రారంభమైన తర్వాత ఆయా పార్టీల నేతలు సభను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్.. కేంద్రం నుండి తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తాము నెక్లెస్ రోడ్డు నుండి కదిలేది లేదని ప్రకటించారు.

పోలీసులు తెలంగాణవాదులకు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే అనుమతిచ్చారు. అయితే కోదండరామ్ మాత్రం తెలంగాణపై రోడ్డు మ్యాప్ ప్రకటించే వరకు తాము కదిలేది లేదని చెప్పారు. అయితే ఈ ప్రకటన తెరాస ఎమ్మెల్యేలతో చర్చించకుండానే కోదండరామ్ చేశారని అంటున్నారు. ఇది వారికి ఆసంతృప్తిని కలిగించడమే కాకుండా ఆగ్రహాన్నికూడా తెప్పించిందట. అంతేకాకుండా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై విమర్శలు చేస్తున్న సమయంలో కోదండ వారించలేదట.

ఈ రెండు ఘటనలు తెరాస ఎమ్మెల్యేలు, నేతలకు మనస్థాపం కలిగించాయని, అందుకే కోదండరామ్ నిరవధిక కవాతు అని ప్రకటించిన వెంటనే అక్కడ నుండి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. మరోవైపు కవాతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన మీడియా వ్యతిరేక బ్యానర్లను కూడా కోదండరామ్ ఖండించారు. మీడియా వ్యతిరేక బ్యానర్లు పెట్టవద్దని, సీమాంధ్రకు చెందిన మీడియా నచ్చని పక్షంలో రిమోట్ చేతిలో ఉంచుకొని మనకు నచ్చిన ఛానల్స్ పెట్టుకోవాలని సూచించారు. మీడియా వ్యతిరేక బ్యానర్లు తెరాస కార్యకర్తలు పెట్టినట్లుగా భావిస్తున్నారు. ఇది కూడా ఆ పార్టీకి రుచించలేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+