బాబుకు జగన్ 'కమ్మ'ని ఝలక్?

YS Jagan-Chandrababu Naidu
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు 'కమ్మ'ని షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. టిడిపికి మొదటి నుండి అండగా ఉన్న కమ్మ వర్గానికి గాలం వేసేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. వరుసగా రెండుసార్లు అధికారానికి టిడిపి దూరంగా ఉండటంతో ఆ వర్గంలోని నిరాసక్తతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారట. తమ వ్యూహంలో భాగంగా త్వరలో జరగనున్న పదిహేడు నియోజకవర్గాల ఉప ఎన్నికల లోపే ఆ వర్గానికి చెందిన పలువురిని తమ వైపుకు లాక్కొని ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారట. కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో టిడిపి అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకుంటున్న కమ్మ వర్గాన్ని జగన్ ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారట. ఇప్పటికే కోస్తాలో రెడ్లు, క్రైస్తవులు జగన్ వైపు ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కమ్మ వర్గానికి ఇప్పటి నుండే గాలం వేస్తే 2014 వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడం సులభం అవుతుందని భావిస్తున్నారట.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. దీంతో ఆ వర్గాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వారికే సీటు కేటాయించి వారిని టిడిపి నుండి లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అలా చేయడం వల్ల టిడిపితో పాటు ఇప్పటికే కాంగ్రెసుకు మద్దతు పలుకుతున్న కమ్మ వర్గం కూడా తమ వైపు మరలే అవకాశం ఉందని జగన్ వర్గం భావిస్తోందంట. అంతేకాకుండా ఆయా జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉన్న వర్గాలను ప్రోత్సహించాలని చూస్తున్నారట. అంతేకాదు ఇప్పటి నుండే వారికి ఏ స్థానాలు కేటాయిస్తారో, ఏ పదవులు ఇస్తారో హామీలు కూడా ఇస్తున్నారట. ఇప్పటికే టిడిపికి ఆది నుండి మద్దతిస్తున్న కమ్మ వర్గానికి చెందిన పలువురు ప్రముఖులతో జగన్ వర్గం ఓసారి మంతనాలు చేసిందంట. అయితే ఆయనపై కేసులు ఉన్న దృష్ట్యా ఏ వర్గాలు ఎంత మేరకు ప్రభావితమవుతాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+