జగన్ పార్టీయే బుక్కీల హాట్ ఫేవరైట్

పరకాలలో బిజెపి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొని ఉన్నట్లు భావిస్తున్నారు. నెల్లూరు లోకసభ విషయంలో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిపైనే ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయి. పంటర్స్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై పది రెట్లు అదనంగా బెట్టింగులు కడుతున్నారు. తదుపరి ఫేవరైట్ కాంగ్రెసు పార్టీయే కావడం విశేషం.
పంటర్లు వైయస్సార్ కాంగ్రెసుపైనే బెట్టింగులు కడుతుండగా, పరకాలలో మాత్రం తెరాసపై కన్నా బిజెపిపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బుక్కీలపై కొరడా ఝళిపించినప్పటికీ హైదరాబాదు కేంద్రంగా బెట్టింగ్ మూడు పూవులు ఆరు కాయలుగా విలసిల్లుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హైదరాబాదు తర్వాత స్థానాలు విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఆక్రమిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పరకాలపై బెట్టింగులు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తెరాసదే పైచేయిగా ఉందని చెబుతున్నప్పటికీ బిజెపి పట్ల పంటర్లు ఆసక్తి చూపుతున్నారు. జగన్ జైలు పాలైన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్ల సానుభూతి పెరిగిందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications