బాబు యాత్రపై బెట్టింగ్స్‌: లాసైన జగన్ పార్టీ నేతలు

 YSR Congress party leaders losing money
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర పైన బెట్టింగ్స్ కట్టి భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నారట. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో వర్షాలు రాక కరవు వచ్చిన విషయం తెలిసిందే. దీనిని ఆధారంగా తీసుకొని సీమాంధ్ర ప్రాంతంలోని పలువురు జగన్ పార్టీ నాయకులు చంద్రబాబు అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేపట్టగానే.. బాబు అనంతలో యాత్ర చేసినన్ని రోజులు వర్షాలు రావని జోరుగా బెట్టింగులు కట్టారట.

అయితే వారికి కలిసి రాలేదు. ఇటీవల అనంతలో ఈదురుగాలులతో జోరుగా వర్షం కురిసింది. దీంతో వర్షాలు రావని బెట్టింగ్స్ కట్టిన జగన్ పార్టీ నాయకులు దాదాపు రూ.25 లక్షల మేర నష్టపోయారని చెబుతున్నారు. ఓ వైపు రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయంగా రోజు రోజుకు ఊపు అందుకుంటున్నప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం బెట్టింగ్స్ కట్టి డబ్బులు నష్టపోతున్నారట. జగన్ పార్టీ స్థాపించినప్పటి నుండి వారు బెట్టింగ్స్ కడుతూ లాస్ అవుతున్నారట.

నల్లపురెడ్డి మెజార్టీపై బెట్టింగ్స్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిప్పుడు జగన్ పార్టీ నేతలు ఆయన మెజార్టీపై జోరుగా బెట్టింగ్స్ కట్టినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముప్పై, నలభై, యాభై వేల మెజార్టీ అంటూ పందాలు కాశారు. తీరా అతను ఇరవై ఒక్క వేయి పై చిలుకు మెజార్టీతో మాత్రమే గెలుపొందారు. దీంతో జగన్ పార్టీ నేతలు అప్పుడు భారీ మొత్తంలో నష్టపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ అదే రిపీట్ అయిందట.

జగన్ బెయిల్ పైనా

సిబిఐ కోర్టులో, హైకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు బెట్టింగ్స్ జోరు కనిపించలేదు. అయితే సుప్రీం కోర్టులో ఇటీవల జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు మాత్రం పందాలు ఊపందుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. సుప్రీంలో తమ అధినేతకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని జోరుగా పందాలు కాశారు. కానీ అత్యున్నత న్యాయస్థానంలో జగన్‌కు చుక్కెదురు కావడమే కాకుండా ఆ పార్టీ నేతలు డబ్బులు పోగొట్టుకున్నారట! తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు పాదయాత్ర పైనా పందాలు కట్టి నష్టపోవడం వారిని నిరుత్సాహపరిచిందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+