వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబును నెత్తికెత్తున్న యాక్టర్ సుమన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Suman
ఒంగోలు: తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ప్రముఖ సినీ నటుడు ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు విజన్ ఉన్న లీడర్ అని ప్రముఖ ఆయన అన్నారు. ఆదివారం ఒక స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను బిసిని కావడం వల్లనే సినీ రంగంలో అణచివేతకు గురయ్యానని ఇటీవల ప్రకటన చేసిన సుమన్ తాజాగా చంద్రబాబును నెత్తికున్నారు.

గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేశానన్నారు. చంద్రబాబులాంటి లీడర్ రాష్ట్రానికి రాష్ట్రానికి అవసరమన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టబోనని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజకీయాలు కలుషితంగా మారాయని ఆవేధన వ్యక్తం చేశారు.

త్వరలో తెలుగులో 100వ సినిమాలో నటించనున్నట్లు చెప్పారు. దేశానికి వెన్నెముక అయిన రైతులు, దేశాన్ని కాపాడుతున్న సైనికుల ఇతి వృత్తాంతంపై 100వ సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. చిన్న సినిమాలు నాలుగు వారాలపాటు తప్పకుండా ఆడుతాయనే నమ్మకం వచ్చినప్పుడు తప్పనిసరిగా సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పారు.

ప్రస్తుతం సినీ పరిశ్రమ కొంత మంది నిర్మాతల చేతుల్లో కీలు బొమ్మగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, డబ్బింగ్ నిర్మాతలు స్థిరపడినప్పుడే సినీ పరిశ్రమ మూడు పవ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుందని ఆయన అన్నారు.

English summary
Telugu cine actor Suman has termed Telugudesam party president as a visionary political leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X