నటి శ్వేత మీనన్‌తో కాంగ్రెస్ ఎంపీ అసభ్య ప్రవర్తన
తన పట్ల ఓ పార్లమెంటు సభ్యుడు అసభ్యంగా ప్రవర్తించాలని ప్రముఖ మళయాళ సినిమా నటి శ్వేతా మీనన్ ఆరోపించారు. కొల్లంలో ఓ పార్టీలో హాజరయ్యేందుకు వచ్చిన శ్వేతా పట్ల కాంగ్రెసు పార్టీ ఎంపి ఎన్ పీతాంబర కురుప్ అసభ్యంగా ప్రవర్తించారట. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
కొల్లంలో జరిగిన బోట్ రేస్ ప్రెసిడెంట్ ట్రోఫీ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని కొల్లంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె చెప్పురు. అందుకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు.

అసభ్యంగా ప్రవర్తించినందుకు తాను ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని శ్వేత చెప్పారు. శ్వేత తన హోటల్‌కు వెళ్లిన తర్వాత కలెక్టర్, కెపిసిసికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే కలెక్టర్ మాత్రం తమకు శ్వేత నుండి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
తన పట్ల ఎంపి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన శ్వేతకు పలువురి నుండి మద్దతు లభిస్తోంది. ఎఎంఎంఎ ప్రెసిడెంట్, ఆమె భర్తలు అండగా నిలబడ్డారు. ఈ విషయాన్ని తాము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు.
మరోవైపు ఎంపి పీతాంబర కురుప్ మాత్రం శ్వేత ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. ఈ ఆరోపణలు నిరాధారణని, తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications