వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిద్రలేని రాత్రి: ఎర్రచీమలతో జైల్లో అక్బర్ ఫైట్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
హిందువుల పైన, హిందూ దేవతల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అదిలాబాదు సబ్ జైలులో ఉన్న మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ జైలులో ఎర్ర చీమలతో ఇబ్బందులు పడుతున్నాడట. జైలులో ఉన్న అక్బరుద్దీన్‌ను కలిసేందుకు హైదరాబాదు నుండి పలువురు మజ్లిస్ నేతలు, శాసనసభ్యులు అదిలాబాదు వెళ్తున్నారు. స్థానిక నేతలు కూడా అతనిని కలుస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారితో అక్బర్ జైలులో తన ఎర్ర చీమల ఇబ్బందులు చెబుతున్నారట.

జైలుకు వచ్చినప్పటి నుండి తనకు సరిగా నిద్ర ఉండటం లేదని చెబుతున్నాడట. తన సెల్ చుట్టూ పెద్ద మొత్తంలో ఎర్ర చీమలు వస్తున్నాయని.. దీంతో తాను నిద్రించలేక పోతున్నానని చెబుతున్నారట. దీనిని తాను జైలు అధికారులకు చెప్పానని, వారు యాంటీ ఇన్‌సెక్ట్ పౌడర్ చల్లుతామని తనతో చెప్పారని అంటున్నారట. ఎర్ర చీమల కారణంగా అక్బరుద్దీన్ నిద్రించలేక పోతున్నారని మజ్లిస్ పార్టీ నేతలు కూడా చెబుతున్నారు.

మజ్లిస్ పార్టీ శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ గురువారం నాడు జైలులో ఉన్న అక్బరుద్దీన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అఫ్సర్ ఖాన్ మాట్లాడుతూ.. ఎర్ర చీమలు చుట్టూ ముసురుకొని కుట్టడంతో అక్బరుద్దీన్ నిన్న రాత్రి నిద్రపోలేక పోయాడని చెప్పారు. ఒక చీమ అతని చెవిలోకి కూడా పోయిందని, దీంతో అతను తీవ్ర బాధను అనుభవించాడని సదరు ఎమ్మెల్యే చెప్పారు. అయితే ఓ మతానికి, జాతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడనే అభియోగాల పైన జైలులో ఉంటున్న అక్బర్ ఇప్పుడు జైల్లో ఎర్ర చీమలతో చీమలతో ఇబ్బందులు పడుతున్నారు.

English summary
MIMLP Akbaruddin Owaisi, who has been charged under several IPC section including waging war against the nation, for an inflammatory speech he made, has been involved in another kind of fight in his barracks in Adilabad jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X