కెటిఆర్‌పై ఆరోపణల కథనం: వెనక రఘునందన్?

హరీష్ రావుపై చేసిన ఆరోపణల్లో ఆయన పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిని కూడా ఇరికించారు. హడావిడి చేసి, సిబిఐకి ఫిర్యాదు కూడా చేశారు. దాన్ని ఆసరా చేసుకుని ఓ న్యాయవాది కోర్టుకు కూడా ఎక్కాడు. అయితే, తగిన ఆధారాలు లేవని అభిప్రాయపడిన కోర్టు కేసును వెనక్కి తీసుకోవాలని న్యాయవాదికి సూచించింది.
ఇప్పుడు కెటి రామారావుపై ఆంధ్రజ్యోతి వార్తాకథనం దుమ్ము రేపుతోంది. రఘునందన రావు తెరాసకు చెందిన కీలకమైన నేతలు, కెసిఆర్ కుటుంబ సభ్యులను లక్ష్యం చేసుకున్నట్లు చెబుతున్నారు. అందుకే, రఘునందన రావు పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. కెటిఆర్ గురించి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనం నూటికి నూరు శాతం నిజమని ఎం.రఘనందన్‌రావు వ్యాఖ్యానించారు.
కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు సాగించే అవినీతి దందాలు చాలా ఉన్నాయని, ఏబీఎన్ చేసిన ప్రసారం మచ్చుకు ఒకటేనన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ తెరాస ఇన్‌చార్జి సతీష్‌రెడ్డి కెటిఆర్ శిష్యుడు కాబట్టే ఆయన నాలుగునెలలుగా జైల్లో ఉన్నా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని రఘునందన రావు ఆరోపించారు. ఏమైనా, తెరాసలో నిప్పు రాజుకుంది.












Click it and Unblock the Notifications