శృతిహాసన్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తిన బన్నీ
హైదరాబాద్: తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ తాజాగా శృతి హాసన్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ముంబై వెళ్లి చెప్పాపెట్టకుండా ఆమెను కలిసి, 'హాయ్' చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయిందట. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'రేసుగుర్రం' సినిమాలో జంటగా నటిస్తున్నారు.

ఏదో పని మీద ముంబై వెళ్ళిన బన్నీ పనిలో పనిగా, శృతి హాసన్‌ని కూడా కలిశాడు. ఇటీవల చెన్నై నుంచి తన నివాసాన్ని ముంబైకి మార్చిన శృతిహాసన్ అకస్మాత్తుగా ఇలా ముంబైలో బన్నీని చూడగానే ఆశ్చర్యపోయిందట. అక్కడతనితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టెర్‌లో పోస్ట్ చేసింది కూడా.
పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన తర్వాత శృతిహాసన్‌కు తెలుగులో ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు ఆమెకు తెలుగులో ఆఫర్లు వచ్చి పడుతున్నాయట. రవితేజ హీరోగా నటించిన బలుపు సినిమాలో కూడా ఆమె నటించింది.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురైన శృతిహాసన్ ఇటీవలి కాలంలో తెరపై అందాలను ఆరబోయడానికి కూడా వెనకాడడం లేదు.












Click it and Unblock the Notifications