మరో లైంగిక దాడిలో ఆశారం: తనయుడి పరారీ

విదేశాలకు పారిపోయే అవకాశం ఉందనే ఉద్దేశంతో సాయిపై పోలీసులు లుకవుట్ నోటీసు జారీ చేసారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఆశారాంపై, ఆయన కుమారుడిపై ఫిర్యాదు చేశారు. ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణపై 75 ఏళ్ల ఆశారాం ఆగస్టులో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి ఆయన రాజస్థాన్‌లో జోథ్‌పూర్ జైలులో ఉంటున్నాడు.
సాయిపై లైంగిక దాడి, అక్రమ నిర్బంధం, తదతిర ఆరోపణలపై కేసు నమోదైంది. సూరత్‌లోని జంగీుపురా పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఆశారాంపై నమోదైన కేసును అహ్మదాబాద్‌కు బదలాయించారు.
ఆశారం తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు అక్క ఫిర్యాదు చేయగా, సాయిపై చెల్లెలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలు 2001, 2006 మధ్య కాలంలో జరిగినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications