క్రికెట్ బెట్టింగ్‌లో బాలీవుడ్ నటుడు, సెలిబ్రిటీలు?

ఐపియల్‌లో బెట్టింగ్ కాసేవారిలో పాత హీరో ఒకరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతను నిర్మాతగా మారాడని చెబుతున్నారు. ఆయన కుమారుడు ప్రస్తుతం టెలీ సీరియల్స్ నిర్మిస్తున్నాడ. అక్రమ లావాదేవీలు జరిగాయని తేలితే తప్ప బెట్టింగులు కట్టినవారిపై పోలీసులు దృష్టి పెట్టే అవకాశం లేదని అంటున్నారు. అయితే, సెలిబ్రిటీలను ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదనే మాట వినిపిస్తోంది.
బెట్టింగు రాకెట్‌లో సెలిబ్రిటీల పేర్లు ముందుకు రావడం ఇదే మొదటిసారి కాదు. నిరుడు బుక్కీలు దేవేంద్ర కొఠారిని, సోను జలన్ అలియాస్ జూనియర్ కోల్‌కతాను క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసినప్పుడు వారు కొంత మంది సెలిబ్రిటీల పేర్లు చెప్పినట్లు సమాచారం.
నిరుడు క్రైం బ్రాంచ్ పోలీసులు నిర్మాత ప్రకాష్ చందనానిని అరెస్టు చేశారు. అతను దుబాయ్‌కి చెందిన సునిల్ అభిచందాని అలియాస్ దుబాయ్ భాగస్వామిగా చెబుతారు. గాలి గాలి చోర్ హై సినిమాకు చందాని డబ్బులు తరలించినట్లు అనుమానిస్తున్నారు.
హవాలా ద్వారా ఓ యాక్షన్ హీరో హవాలా మార్గంలో దుబాయ్‌కి డబ్బులు పంపిన విషయం పోలీసుల దృష్టికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. తగిన సాక్ష్యాధారాలు లభించకపోవడంతో, పరిధి సమస్య తలెత్తడంతో పోలీసులు ముందుకు సాగలేదు.












Click it and Unblock the Notifications