బుకీల కోడ్: ధోనీ హెలికాప్టర్, శ్రీశాంత్ రోత్రు

విందూ దారా సింగ్ సహాయంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కొందరు క్రికెటర్ల కోడ్ నేమ్‌లను డీకోడ్ చేసినట్లు చెబుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విందూను జాక్ అనే పిలిచేవారట. శ్రీశాంత్‌ను రోత్రు అని, గురునాథ్ మేయప్పన్‌ను గురు అని సంబోధించేవారని తెలుస్తోంది.
బుకీల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీల్లో, ఐప్యాడ్స్‌లో ఈ కోడ్ నేమ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాప్ చేసిన బుకీల సంభాషణల్లో కూడా ఈ పేర్లు దొర్లాయట. బుకీలు, అండర్ వరల్డ్ సభ్యులు నిక్ నేమ్స్ వాడడం సర్వసాధారణమేనని పోలీసులు అంటున్నారు.
రాడియా టేపుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో టేప్ చేసిన సంభాషణలపై పోలీసులు పెదవి విప్పడం లేదు. భారత కెప్టెన్‌కు హెలికాప్టర్ అని పేరు పెడితే, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌కు రావణ్ అని పేరు పెట్టారట. లసతి మలింగకు మక్కీ అని, యువరాజ్ సింగ్‌కు మోడల్ అని పేర్లు పెట్టారని తెలుస్తోంది. బుకీలకు, మోడల్స్‌కు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా కోడ్ నేమ్స్ ఇచ్చారట.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications