వైయస్‌కు ఫోన్ చేసి 'గాలి'కి షాకిచ్చారు!

ఒకే గదిలో ఉండటం విషయమే కాదని, ఏం చేశారో కూడా చెప్పాలని గాలి అతనికి సూచించారు. దానికి కాసు బదులిస్తూ... ఏం చేసినా వారిద్దరేనని, తాను ఎక్కువగా కలిసే వాడిని కాదన్నారు. ఆ తర్వాత కాసు జేబులోంచి సెల్ ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసి... ఆ రోజు మనతో పాటు హెలికాప్టర్‌లో ప్రయాణించిన గాలి ముద్దుకృష్ణమ మాట్లాడుతారట.. అని ఫోన్‌ను గాలికి ఇచ్చాడు. గాలి హలో హలో అన్నా అవతలి నుండి ఎవరు పలకలేదు.
ఎవరికి ఫోన్ చేశావని కాసును అడిగారు. అందుకు అతను వైయస్ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేశానని, మాట్లాడమని చమత్కరించారు. దాంతో గాలి ఓ నిమిషం షాక్‌కు గురయ్యారు. అనంతంర వైయస్ ఫోనేమిటయ్యా బాబు... నువ్వే మాట్లాడుకో అని ఫోన్ తిరిగి ఇచ్చారు. కాసు అంత సీరియస్‌గా సెల్ ఫోన్ తీసి నెంబర్ కొట్టి గాలి ముద్దుకృష్ణమకు ఇవ్వడం అక్కడ ఉన్న వారందరినీ కాసేపు నవ్వించింది.
ఈ సందర్భంగా.. వైయస్ ముఖ్యమంత్రి అయ్యాక తాను, కాసు, వైయస్ ఉన్నప్పుడు జరిగిన ఒక సంభాషణను గాలి ముద్దృకృష్ణమ చెప్పారు. హెలికాప్టర్లో తాము ముగ్గురమే ఉన్నామని, 2004లో డబ్బు లేకుండానే అంతా గెలిచామని, ఇప్పుడు ఇంత అత్యాశ మంచిది కాదని తాను చెప్పానని అన్నారు. అప్పుడు వైయస్.. అవతలి వాళ్లకు టివిలు, పేపర్లు అన్నీ ఉంటే మనకు ఉండొద్దా, డబ్బులు కావద్దా అని సమర్థించుకున్నారని, దీనికి కాసు ప్రత్యక్ష సాక్షి అని చెప్పారు. నిజమేనంటూ కాసు తలూపారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications