అలా బుక్కయ్యారు!: చండిలపై భార్యకు సందేహం

టవల్ పెట్టుకొని బౌలింగ్ చేయడం, వాచి తిప్పి పెట్టుకోవడం లాంటి సంకేతాలతో ఫిక్సింగ్ రాకెట్ పని చేయదని బుకీలు అభిప్రాయపడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఫిక్సర్లతో ఆటగాళ్లు ఎట్టి పరిస్థితుల్లోను ఫోన్లో మాట్లాడరని, ఇది మ్యాచ్ ఫిక్సింగులో ప్రాథమిక సూత్రమని అంటున్నారట.
శ్రీశాంత్, దొరికిన ఇతర క్రికెటర్లు మొత్తం వ్యవహారంలో చిన్న పావులేనని కీలక వ్యక్తులు కాకపోవచ్చునని, కొందరు జూనియర్ బుకీల అత్యాశ వల్ల వారు దొరికిపోయారని బెట్టింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట. కొందరి కఅనుభవరాహిత్యమే వారిని పట్టించిందని చెబుతున్నారట.
మరోవైపు స్పాట్ ఫిక్సింగ్ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న చండిలాపై అతని భార్యకు ముందే అనుమానం వచ్చిందట. చండిలా ఇంటికి భారీగా డబ్బులు పంపిస్తుండటంతో.. ఇటీవల మీరు చాలా డబ్బును ఇంటికి పంపిస్తున్నారని, ఎక్కడి నుండి వచ్చిందని ఆమె భర్తను ప్రశ్నించిందట. ఫోన్‌లో ఇలాంటి విషయాలు మాట్లాడవద్దని చండిలా భార్యకు సూచించాడట. వీరి ఫోన్ సంభాషణలను ఢిల్లీ పోలీసులు రికార్డ్ చేశారు.












Click it and Unblock the Notifications