చెర్రెత్తిన బాబు: చూపిస్తే రాసిస్తానని ఫైర్

Chandrababu Naidu
ఏలూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మిస్టర్ క్లీన్‌గా చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతారనే విషయం అందరికీ తెలుసు. అవినీతిపై పోరాటంలో అన్నా హజారే పక్కన నిలబడడానికి ఉత్సుకత ప్రదర్శిస్తారని ప్రత్యర్థులు ఆయనపై వ్యంగ్యాస్త్రాలు విసురుతుంటారు. ప్రత్యర్థులు విమర్శల కోసం విమర్శలు, ఆరోపణల కోసం ఆరోపణలు చేయడం మామూలే కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు చిర్రెత్తిపోయారు.

"సార్! మీకు సింగపూర్‌లో హోటల్ ఉన్నదట కదా'' అంటూ ఓ కాంగ్రెస్ కార్యకర్త వేసిన ప్రశ్న చంద్రబాబును చిరాకు పెట్టింది. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామంలో ప్రసంగిస్తుండగా - నల్ల విజయకుమార్ అనే వ్యక్తి చంద్రబాబుకు అడ్డుపడ్డాడు. అది గమనించిన చంద్రబాబు - ఆయన చేతికి మైకు ఇచ్చారు.

"ఏ పార్టీ.. ఏం పేరు'' అని అతడిని చంద్రబాబు ప్రశ్నించారు. నీది కాంగ్రెస్ పార్టీయా అని అతన్ని నిలదీశారు. అవునని చెప్పాడు. 'సరే.. ఏమి అడుగుతావో అడుగు' అని ప్రోత్సహించాడు. "టివిల్లో, పేపర్లో వచ్చాయి. నలుగురూ చెప్పుకుంటున్నారు, సింగపూర్‌లో మీకు హోటళ్లు ఉన్నాయంటున్నారు. నిజమేనా?'' అని ప్రశ్నించాడా వ్యక్తి.

ఆ ప్రశ్నతో చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే - " కాంగ్రెస్ దొంగలు ప్రచారం చేస్తున్నారు. అడ్రస్ తీసుకురా.. ఆ హోటల్ నీకు రాసిస్తాను. సిగ్గులేదా? నీ కాంగ్రెస్ నాయకులు అవినీతి చేసి జైలుకు పోయారు. అలాంటి వాళ్లను వదిలేస్తావా, లేదా?' అంటూ తీవ్రస్వరంతో మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+