రాహుల్ పెళ్లి చేసుకోడని.. నాలుక్కర్చుకున్నాడు

Rahul Gandhi
వంశపారంపర్య పరిపాలనకు చరమగీతం పాడేందుకు వివాహం చేసుకోనని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ చేశారని ఏఐసిసి కార్యదర్శి జీవన్ వాల్మీకి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆ తర్వాత వాల్మీకి క్షమాపణలు కోరారు. బుధవారం ముంబైలో విలేకరులతో జీవన్ వాల్మీకి మాట్లాడారు.

మొదట ఆయన మాట్లాడుతూ.. వంశపారంపర్య పాలనకు చెక్ చెప్పేందుకు రాహుల్ పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నారని చెప్పారు. మరోసారి చెప్పాలని విలేకరులు ఆయనను ప్రశ్నించారు. దానిని తిరిగి చెప్పేందుకు వాల్మీకి నిరాకరించారు. అంతేకాకుండా క్షమాపణలు చెప్పారు.

రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలను తాను ఎక్కడో చదివానని, దానినే ప్రస్తుతం తాను చెబుతున్నానని వివరణ ఇచ్చారు. తాను తప్పుగా చెప్పి ఉంటానని, అందుకే క్షమాపణలు కోరానని చెప్పారు.

రాహుల్ పెళ్లి పైన అప్పుడప్పుడు చర్చకు వస్తుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ తన నియోజకవర్గం అమేథీ వెళ్లినప్పుడు పెళ్లి ప్రస్తావన రావడం గమనార్హం. తన నియోజకవర్గ ప్రజలు ఆయనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఆయన త్వరలో చేసుకుంటానని మాటిచ్చారు!

ఫిబ్రవరిలో అమేథీలోని చౌక్ మార్కెట్ మీదుగా రాహుల్ వెళ్తున్నారు. అదే సమయంలో ఓ గార్మెంట్స్ షాప్ తెరుస్తున్న దేవీ ప్రసాద్‌ను చూసి యువనేత కుశల ప్రశ్నలు వేశారు. వ్యాపారం ఎలా ఉందంటూ ఆరా తీశారు. దేవీ ప్రసాద్‌కు మహాత్మా గాంధీ వారసులతో మాట్లాడే చనువు ఉంది.

దీనిని ఆసరాగా తీసుకుని అంతా బాగానే ఉందని చెబుతూ... మా కోరిక అంతా ఒక్కటే అన్నారు. ఇప్పటికైనా మీరు పెళ్లి చేసుకోవాలని, మీ పెళ్లి ఊరేగింపు అమేథీలో సాగాలని, మా కోడలు కోసం మేమంతా ఎదురు చూస్తున్నామని, ఇది నియోజకవర్గ ప్రజల కోరిక అని దేవీ ప్రసాద్ రాహుల్‌తో అన్నారు. దీనికి స్పందించిన యువరాజు త్వరలో చేసుకుంటానని సమాధానమిచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+