'తెలంగాణ తల్లిలో దొరసాని లక్షణాలు'

తెలంగాణ తల్లి విగ్రహంలో దొరసాని లక్షణాలున్నాయని, ఖరీదైన పట్టు చీరలు, బంగారం, చేతిలో బతుకమ్మ ఇవన్నీ తెలంగాణ తల్లి లక్షణాలు కావన్నారు. ఆ విగ్రహాలన్నీ పీకేసాకా తెలంగాణ అంతటా చాకలి ఐలమ్మ విగ్రహాలు పెట్టుకుందామని చెప్పారు. పదేళ్ల తెలంగాణ ఉద్యమంతో దొరలంతా నాయకులుగా ముందుకొచ్చారని, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల చైతన్యం అణిచివేతకు గురయిందన్నారు.
తెలంగాణ రాగానే దొరల చేతుల్లోని ఐక్యకార్యాచరణ సమితికి మూత పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా తొలి ముఖ్యమంత్రి మాదిగ వర్గానికి చెందిన వారే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ అంటేనే ఒంటి కాలిపై లేచే ఐలయ్య.. తెలంగాణ తల్లి విగ్రహంలో దొరసాని లక్షణాలు ఉన్నాయని చెప్పడం గమనార్హం.
కాగా గతంలోను తెలంగాణ తల్లి విగ్రహంపై పలు విమర్శలు వినవచ్చిన విషయం తెలిసిందే. ఆ విగ్రహంలో తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్కకుంట్ల కవిత పోలికలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.












Click it and Unblock the Notifications