దాసరి చేతులు కట్టేశారా: బొబ్బులిపులితో మళ్లీ?

రాష్ట్రంలోని ఓ వర్గాన్ని బుజ్జగించడానికి దాసరి నారాయణ రావును గతంలో అక్కున చేర్చుకున్న కాంగ్రెసు ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి చిరంజీవిని ఆదరిస్తోంది. దీంతో మొదటి నుంచీ కాంగ్రెసుకు మూల స్తంభంగా ఉంటూ వస్తున్న దాసరి నారాయణ రావు ప్రాబల్యం కాంగ్రెసులో తగ్గిందని అంటున్నారు.
బలుపు సినిమాపై తన అభిప్రాయాన్ని ఏ విధమైన వివాదాలు సృష్టించే విధంగా వ్యక్తం చేశారు. రవి తేజ హీరోగా నటించిన ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని దాసరి నారాయణ రావు ప్రకటన రూపంలో విడుదల చేసి ఊరుకున్నారు. దాసరి నారాయణరావు మాటకు సినీ పరిశ్రమలోనే కాదు, సినీ ప్రేక్షకుల్లో కూడా మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఆయన అభిప్రాయాన్ని అందరూ లెక్కలోకి తీసుకుంటారు.
గతంలో ఆయన ఉదయం దినపత్రికను సంచలనాత్మకంగా నడిపారు. అది చేతులు మారి అనూహ్యమైన పరిస్థితిలో మూతపడింది. ప్రస్తుతం బయటకు చురుగ్గా ముందుకు రాకపోయినప్పటికీ దాసరి నారాయణ రావు తన సత్తా చాటడానికి తెర వెనక ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో పతంజలి సంపాదకుడిగా నడిపిని బొబ్బులిపులి రాజకీయ వార పత్రికను మళ్లీ ప్రజల ముందుకు తేవడానికి ఆయన ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి.












Click it and Unblock the Notifications