జియాను వదిలేయాలని సల్మాన్ చెప్పాడా?

జియా ఖాన్, సూరజ్ మధ్య సంబంధం సూరజ్ తండ్రి ఆదిత్య పంచోలీకి ఇష్టం లేదని, దాంతో జోక్యం చేసుకోవాలని రబియా సల్మాన్ ఖాన్‌తో చెప్పిందట. సూరజ్, ఆదిత్య పంచోలీ చేతుల్లో జియా ఖాన్ తీవ్రమైన ఇబ్బందులకు, మానసిక వ్యధకు గురైందని రబియా ఆరోపించిన విషయం తెలిసిందే.
ప్రస్తుత పరిణామంతో సూరజ్ పంచోలీ కెరీర్ ప్రమాదంలో పడింది. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ కింద నిర్మించే చిత్రంలో సూరజ్ పక్కన నటుడు సునీల్ శెట్టి కూతురు అథియా నటించాల్సి ఉండింది. అయితే, తన కూతురును ఆ చిత్రంలో నటింపజేసే విషయంపై సునీల్ శెట్టి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
సూరజ్ అరెస్టయిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టు ప్రారంభమవుతుందా, లేదా అనే సందేహం నెలకొంది. ఈ చిత్రంపై ప్రస్తుతం ఎవరూ నోరు విప్పడం లేదు. ఆ చిత్రం 1983లో సుభాష్ ఘాయ్ చేసిన హీరో చిత్రానికి రీమేక్. కాగా, పాత ప్రేమలేఖను రబియా పోలీసుల ముందు పెడుతోందని సూరజ్ తల్లి, నటి జరీనా వాహబ్ అంటోంది. మొత్తం మీద, సూరజ్ ఖాన్ కెరీర్ ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications