జగన్ పార్టీలో పరిస్థితి అదుపు తప్పుతోందా?

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి నివాసం వద్ద ఆయన వర్గానికి చెందినవారు సమావేశం కాగా, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నాయకత్వంలో ఆయన వర్గానికి చెందిన వారంతా దొరసానిపల్లెలోని కల్యాణ మండపంలో సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ రాయలసీమ ఇన్‌ఛార్జి భూమా నాగిరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, డీసీసీబీ ఛైర్మన్ తిరుపేలరెడ్డి, ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి, మాజీ మేయర్ రవీంద్రారెడ్డిలు రమణారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. సమావేశానికి రావాలని కోరారు.
భవిష్యత్తులో ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ కానీ ఇప్పిస్తామని నచ్చజెప్పారు. అయితే ఇందుకు అంగీకరించని రమణారెడ్డి, రాచమల్లు అభ్యర్థిత్వ ప్రకటన సమావేశాన్ని తన వర్గం పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. దీంతో నేతలు రమణారెడ్డి కుమారుడు మురళీధర్‌రెడ్డిని బలవంతంగా తమ వెంట సమావేశానికితీసుకొని వెళ్లారు.
కార్యకర్తలతో, నాయకత్వంతో సంప్రదించకుండా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ప్రకటించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటివి మళ్లీ జరగవంటూ పార్టీ ముఖ్య నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. తనకున్న అభిప్రాయాలు పార్టీ వద్ద వ్యక్తం చేయడం తప్ప పార్టీతో తనకు ఎలాంటి విభేదాలూ లేవన్నారు.












Click it and Unblock the Notifications