కొత్త పోకడ!: బాబుపై జగన్ ఎమ్మెల్యే దీక్షాస్త్రం

Dwarampudi Chandrasekhar Reddy
హైదరాబాద్: అధికార పార్టీ వైఫల్యాలను నిరసిస్తూ ప్రతిపక్షాలు ధర్నాలు చేయడం సాధారణం. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారనో మరో కారణంతోనే విపక్షాలు ప్రభుత్వంపై ధర్నా, దీక్షాస్త్రాలు ప్రయోగిస్తుంటాయి. అయితే, కాంగ్రెసు పార్టీ అసంతృప్త వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మాత్రం విపక్షం పైనే దీక్షకు పూనుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల విషయంలో జగన్ వర్గం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఆందోళన చేపట్టాలని ఆలోచిస్తున్నారట. చంద్రబాబు తప్పుడు హామీలు గుప్పించారని, గుప్పిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని కోసం ఆయన సన్నద్దమవుతున్నారట.

గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని, ప్రజా సంక్షేమం ఆయనకు పట్టదని, ఇటీవల వస్తున్నా మీకోసం పాదయాత్రలో చంద్రబాబు హామీలు గుప్పిస్తున్నా అవి నెరవేర్చరని, నెరవేర్చలేనివిగా ఉన్నవని ఆయన ప్రజల్లోకి తీసుకు వెళ్లే ఉద్దేశ్యంలో భాగంగానే ఈ ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగాలనే యోచనలో ఉన్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+