అజరుద్దీన్ పాత్రలో ముద్దుల హీరో హష్మీ

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజరుద్దీన్ క్రికెట్ కెరీర్ ముగిసింది. ఐబిఎన్ లైవ్ కథనం ప్రకారం - అజరుద్దీన్ పాత్రను హిందీ సినిమాల్లో ముద్దు పెట్టడంలో ఆరితేరిన హీరోగా పేరు పొందిన హష్మీ పోషిస్తాడట.
తన జీవిత చరిత్రను తెరకు ఎక్కించడానికి అజరుద్దీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. హష్మీ చాలా సినిమాలకు దర్శరకత్వం వహించిన కునాల్ దేశ్‌ముఖ్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తారని అంటున్నారు.
క్రికెట్ నేపథ్యంగా బుకీ ఉదంతంపై నిర్మించిన జన్నత్ సినిమాలో హష్మీ, కునాల్ కలిసి పనిచేశారు. అజరుద్దీన్‌పై సినిమా స్పైసీగా ఉంటుందని భావిస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాలు, సంగీతా బిజలానీతో రెండో వివాహం వంటివి సినిమాకు కలర్‌ను అద్దుతాయని అంటున్నారు. ఈ సినిమాలో అజర్‌ను ఏ షేడ్‌లో చూపిస్తారో చూడాల్సిందే.












Click it and Unblock the Notifications