బాబు ఆశలు గల్లంతు: జగన్ పార్టీలోకి చాడ?

Chada Suresh Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి ఉద్వాసనకు గురైన మాజీ పార్లమెంటు సభ్యుడు చాడ సురేష్ రెడ్డి మనసు మార్చుకున్నారనే మాట వినిపిస్తోంది. చాడ సురేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి చేయిచ్చి, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన చాడ సురేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.

మూడేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన సురేష్ రెడ్డి తెరాసలో చేరారు. వరంగల్ జిల్లాలో కొండా దంపతులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరమైన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసులో చేరితే పలుకుబడి ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చాడ సురేష్ రెడ్డి స్థాయి నాయకులు లేరు.

రెండు సార్లు హన్మకొండ నుంచి చాడ సురేష్ రెడ్డి గతంలో పార్లమెంటుకు వెళ్లారు. చాడ సురేష్ రెడ్డి తెరాస నుంచి ఉద్వాసన అయిన వార్తకు జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక విశేష ప్రాధాన్యం ఇచ్చింది. రెడ్డి ఫ్యాక్టర్‌తో పాటు వరంగల్ జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసుకు నాయకత్వం కొరత తనకు ఉపకరిస్తుందని చాడ సురేష్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అదే సమయంలో తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. తెలుగుదేశం పార్టీ కెసిఆర్‌నే కాకుండా కోదండరామ్‌ను కూడా విమర్శిస్తోంది. వైయస్ జగన్ పార్టీ మాత్రం కోదండరామ్ పట్ల మెతకవైఖరి అవలబిస్తోంది. వైయస్ జగన్ పార్టీ వ్యూహంలో భాగంగానే చాడ సురేష్ రెడ్డి మాట్లాడినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+