ఫైవ్ స్టార్ హోటల్ యజమాని భార్యపై కన్ను?

 A five star hotel owner's wife is under scanner?
చెన్నై: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాల బురద దేశమంతా పాకినట్లే కనిపిస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ యజమాని సతీమణి , ఓ క్రికెట్ బుకీకి వందసార్లకు పైగా ఫోన్‌లు చేసిందట. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 23న ఆ క్రికెట్‌ బుకీని సిబిసిఐడి అరెస్టు చేసింది. ఆమె పేరు, ఆమె భర్త పేరు ,హోటల్‌, తదితర వివరాలేమీ బయటకు పొక్కనీయకుండా తమిళనాడు క్రైం బ్రాంచ్‌ పోలీసులు జాగ్రత్త పడుతున్నారు.

ఆమె 100 కాల్స్‌కుపైగా ఉత్తమ్‌ సి. జైన్‌ ఆ బుకీకి చేయడంపై, వారిద్దరి మధ్య అసలు ఏమీ ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు సిబిసిఐడి 9 మంది బుకీలను అరెస్టు చేయగా, వారికి విఐపి గ్లాంబర్స్‌తో ఉన్న సంబంధాలు ఉన్నాయా? లేవా ? అన్న దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు.

బుకీ జైన్‌ సంవత్సర ఆదాయం 2011 , 31 మార్చినాటికి 50 లక్షలు రూపాయాలుగా చెప్పాడని, 2 కోట్ల రూపాయా లతో ఒక అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. స్పాట్‌ ఫిక్సింగ్‌ రోజుకో కొత్త మలుపు తిరుగుతుండగా, ఇంకా పలువురు ప్రముఖ క్రికెటర్ల పేర్లు బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.

హైదరాబాద్‌నుంచి దుబాయ్‌కు పారిపోయేందుకు ప్రయత్నించి అరెస్టు అయిన ముంబై బుకీ మహ్మద్‌ యాహ్య పలువురు ప్రముఖ క్రికెటర్ల పేర్లను బయట పెట్టినట్లు తెలుస్తోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కో విషయం బయటపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+