విభజనపై మనస్తాపం: జగన్ పార్టీ వైపు గాదె?

Gade Venakat Reddy
హైదరాబాద్: కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు గాదె వెంకటరెడ్డి పార్టీలోని పరిమాణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని విభజించాలనే కాంగ్రెసు అధిష్టానం వైఖరి పట్ల ఆయన మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. దాంతో ఆయన తన పార్టీ సభ్యత్వానికి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయవచ్చునని వినికిడి.

ప్రకాశం జిల్లాకు చెందిన గాదె వెంకటరెడ్డి మొదటి నుంచీ సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. సమైక్యవాదులకు ఆయన అందుకు తగిన వాదనాపటిమను అందిస్తున్నారు. సమైక్యవాదానికి అనుకూలంగా ఆయన పటిష్టమైన వాదనను రూపొందించారు. అయితే, పరిస్థితి సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఉండడం ఆయనకు మింగుడు పడడం లేదని అంటున్నారు.

గతంలో సమైక్యవాదం వినిపించిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మంత్రి పదవులు రాగానే తెలంగాణ సమస్యపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటన చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్లమెంటు సభ్యులతో ఆయన తెగదెంపులు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

గాదె వెంకటరెడ్డి శాసనసభలో సీనియర్ శాసనసభ్యుడు. అయినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రి పదవి దక్కకపోవడంపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కానీ తన అసంతృప్తిని పెద్దగా బయటకు వ్యక్తం చేయలేదు. కానీ రాష్ట్ర విభజనపై మాత్రం ఆయన పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్లు, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+