'మెడలో గోల్డ్ చైన్: జగన్‌కు జైల్లో రాచమర్యాద'

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చంచల్‌గూడ జైలులో రాచమర్యాదలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు బుధవారం ఆరోపించారు. మెడలో బంగారు గొలుసుతో జగన్ జైలు నుండి రాజాలాగా ఆసుపత్రికి రావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.

ఒక ఖైదీ జైలుకు వచ్చినప్పుడు ఆయన వద్ద ఉండే గొలుసు, ఉంగరాలు, డబ్బు, చివరకు మొలతాడు కూడా జైలు అధికారులు తీసుకొని, విడుదలై బయటకు వెళ్లేటప్పుడు ఇస్తారని చెప్పారు. జగన్‌కు మాత్రం జైల్లో వివిఐపి మర్యాదలు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ములాఖత్‌లు వంటి సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిసోందనేందుకు ఇది ఉదాహరణ అన్నారు. జగన్ మెడలో గొలుసుతో ఉన్న ఫోటోను ఈ సందర్భంగా ఆయన విలేకరులకు చూపించారు.

టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామాలు ఆమోదించుకోలేదని చిత్తూరు జిల్లా యాత్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల ప్రశ్నించడంపై ఆయన స్పందించారు. మరి మీ అన్న వైయస్ జగన్, మీ అమ్మ వైయస్ విజయమ్మల రాజీనామాలను ఎందుకు ఆమోదింపచేసుకోలేకపోయారని ఆయన ప్రశ్నించారు. తమవి దొంగ రాజీనామాలైతే వాళ్లవేం రాజీనామాలన్నారు.

తమ పార్టీ ప్రజాప్రతినిధులు ఆగస్టు 1, 2, 3 తేదీల్లో రాజీనామాలు చేశారని, తాను స్పీకర్ ఫార్మాట్‌లో చేశానని చెప్పారు. తమ పార్టీ వారంతా అదే ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించారన్నారు. వాళ్లకు సంబంధించి నకళ్లు తమ వద్ద రికార్డు చేశామన్నారు. లోక్‌సభలో తమ పార్టీ ఎంపీలు పోరాడుతుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+