భజ్జీ బల్లే బల్లే: పాటలైనా పాడు బ్రదర్...

harbhajan singh
న్యూఢిల్లీ: ఆట ఎలాగూ లేదూ పాటైనా పాడుతా బ్రదర్ అంటూ భారత క్రికెటర్ హర్భజన్ రెచ్చిపోతున్నాడు. జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన భజ్జీ ఇప్పుడు సంగీతం వైపు దృష్టి మళ్లించాడు. ఈ పంజాబ్ ఆఫ్ స్పిన్నర్ గాయకుడిగా అవతారం ఎత్తాడు.

హర్భజన్ సింగ్ ఇంతకు ముదు ఓ పంజాబీ పాట పాడిన విషయం తెలిసిందే. తాజాగా మరో పాట పాడి తన కళాప్రదర్శనకు పూనుకున్నాడు. మేరీ మా అంటూ తల్లి గొప్పదనంపై పాట పాడాడు. ఈ వీడియో ఇప్పుడు యూ ట్యూబ్‌లో హంగామా చేస్తోంది.

క్రికెట్ తర్వాత తాను అమితంగా ప్రేమించేది సంగీతాన్నే అని, మెల్లగా ఈ రంగంలోనూ ప్రావీణ్యం సంపాదించాలని అనుకుంటున్నానని ఆయన అన్నాడు. హర్భజన్ సింగ్ తిరిగి జాతీయ జట్టులోకి వస్తానని ఇటీవలే ప్రకటించాడు. అందుకు తాను చెమటోడుస్తున్నట్లు కూడా చెప్పాడు.

మరో ఐదేళ్ల పాటు క్రికెట్ ఆడే సత్తా తనలో ఉందని చెప్పుకున్నాడు. తిరిగి జట్టులోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నానని చెప్పాడు. ఐపియల్ ముంబై జట్టు తరఫున ఆడి రాణించినట్లు ఆయన తెలిపాడు. తాజా పరిణామాలను చూస్తుంటే, హర్భజన్ సింగ్ సంగీతానికే పరిమితమై అక్కడ తన ప్రతిభను చాటుకుంటే మంచిదేమోనని అనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+