హరికృష్ణ యాత్రకు చంద్రబాబు బ్రేక్‌లు?

Harikrishna
హైదరాబాద్: సమైక్యాంధ్రకు అనుకూలంగా రాజీనామా చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ చైతన్యయాత్రను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బ్రేక్‌లు వేసినట్లు భావిస్తున్నారు. హరికృష్ణ యాత్రను దెబ్బ తీసేందుకే చంద్రబాబు సీమాంధ్రలో పర్యటన చేశారనే మాట వినిపిస్తోంది. నిజానికి ఈ నెల 5వ తేదీన హరికృష్ణ కృష్ణా జిల్లా నిమ్మకూరు నుంచి తన చైతన్య రథయాత్రను ప్రారంభించాల్సి ఉంది.

చంద్రబాబు, హరికృష్ణల మధ్య బేధాభిప్రాయాలు తారస్థాయికి చేరడంపై బహిరంగంగా పెదవి విప్పడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాకరిస్తున్నారు. కానీ హరికృష్ణ వివాదంపై మరికొన్నాళ్ళు వేచిచూసే ధోరణిని అవలంబించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో హరికృష్ణ చురుగ్గా కదలకుండా ఎప్పటికప్పుడు అడ్డుపుల్లలు వేసే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే హరికృష్ణ చైతన్యయాత్రకు కళ్లెం వేయడానికి చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రను చేపట్టినట్లు చెబుతున్నారు.

సీమాంధ్ర ఉద్యమానికి బాసటగా నిలవాలని నిర్ణయించిన ఆయన అక్కడ ఉద్యమం ప్రారంభమై 45రోజులు గడుస్తున్నా చైతన్యయాత్రపై కార్యాచరణకు దిగకపోవడంలోని ఆంతర్యం ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. తన స్వస్థలం నిమ్మకూరునుంచి చైతన్యయాత్ర నిర్వహిస్తానన్న సంకేతాలు ఇచ్చిన హరికృష్ణ ఆ తర్వాత చడీచప్పుడు లేకుండా ఉండిపోయారు.

విభజనలో తన పాత్ర ఏమీ లేదని చెప్పటంతో పాటు, విభజన ప్రక్రియ ఆగిపోయే వరకు ఉద్యమంలో పాల్గొని, అండగా ఉంటానని చెప్పటానికే హరికృష్ట చైతన్యయాత్ర చేయటానికి సన్నద్ధమయ్యానని ప్రకటించారు. తాను నిర్వహించతలపెట్టిన చైతన్యయాత్రతో చంద్రబాబును ఢీకొట్టడానికి హరికృష్ణ వెనకాడుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+