తెలంగాణ ముఖ్యమంత్రి రేసులో హరీష్ రావు!

రాష్ట్ర విభజన అంశంపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసేందుకు సుముఖంగా లేదు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమ పాత్ర ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే తెరాస ఉంటుందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చినా కాంగ్రెసు పార్టీ కంటే తెరాసకే వచ్చే ఎన్నికలలో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముంది. తెరాస అధికారంలోకి వస్తే దళితులను ముఖ్యమంత్రిగా, మైనార్టీలను ఉప ముఖ్యమంత్రిగా చేస్తానని కెసిఆర్ మొదటి నుండి చెబుతున్నారు.
అయితే, తెలంగాణ సాధించాక తెరాస గెలిస్తే కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. హరీష్ రావును కూడా చాలామంది కోరుకుంటున్నారు. తెరాసలోనే కాకుండా తెలంగాణవాదుల్లో హరీష్ రావుకు ఒక రకమైన ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఆయన ముఖ్యమంత్రి అయితే బావుంటుందని పలువురు భావిస్తున్నారు.
సోమవారం వరంగల్ జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ సిఎం అయ్యే అవకాశం ఉందని సమావేశంలో వరంగల్ జిల్లాకు చెందిన సంఘం మహిళా నేత సువర్ణ కుమారి అన్నారు. ఆయన సిఎం అయితేనే తమ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని చెప్పారు. తమ పార్టీలో హరీశ్ కోహినూర్ వజ్రమని తెరాస నేత రెహముల్లాఖాన్ అన్నారు.












Click it and Unblock the Notifications