తమన్నా..: పొలాలకు హీరోయిన్లు కాపలా!?

అయితే, తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామ రైతులు తమ పంట పొలాలపై ఇతరుల దృష్టి పడకుండా ఉండేందుకు సరికొత్త ప్లాన్ వేశారు. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్‌ల ఫోటోల భారీ ఫ్లెక్సీలను పంట పొలాల్లో ఏర్పాటు చేశారు. తమ పంట పైన ఇతరుల దృష్టి పడి దిష్టి తగలకుండా ఉండేందుకు అలా కట్టారట. జిల్లాలోని రాజమండ్రి పరిసర ప్రాంతాల రైతులు ఇలాంటి వినూత్నమైన ప్రయోగం చేశారు.
తమన్నా, అనుష్క వంటి హీరోయిన్ల ఫోటోలను పంట పొలాల్లో పెట్టారు. సినిమా హీరోయిన్ల ఫోటోలను పెట్టడం వల్ల అటుగా వచ్చే వారి దృష్టి తమ పంటపై పడకుండా అందమైన ముద్దుగుమ్మలపై ఉంటుందని, అప్పుడు తమ పంటకు దిష్టి తగలదని వారు భావిస్తున్నారట. పంటకు దిష్టి తగలకుండా ఉండేందుకు రైతులు కొత్తగా ఫ్లెక్సీలు కట్టడం అటు నుండి వెళ్తున్న వారిని ఆకట్టుకుంటోంది.












Click it and Unblock the Notifications