సెల్‌ఫోన్ ఉపయోగించడం తెలియని రోశయ్య

చెన్నైలోని తెలుగు జర్నలిస్టుల సంఘంకు చెందిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనకు ఇప్పటికీ సెల్‌ఫోన్ వాడటం తెలియదని, ఇన్‌కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు మాత్రమే తనకు సెల్‌ఫోన్ను తెచ్చి ఇస్తారని తెలిపారు.
తన చేతిలో ఫోన్ ఉండదని, ఫోన్ వచ్చినప్పుడు మాత్రం తెచ్చిస్తారని, దానిని మాట్లాడక కట్ చేయడం కూడా తనకు తెలియదని, దీంతో ఫోన్ తెచ్చిన వ్యక్తికే తాను కట్ చేసేందుకు ఇస్తానని చెప్పారు.
గతంలో తాము అందించే సమాచారం వారానికో, పది రోజులకో పత్రికలో ప్రచురితమయ్యేవని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం విలేకర్లు చేతిలో ఉన్న సెల్‌ఫోన్ ద్వారా అత్యంత వేగంగా సమాచారాన్ని తమ ఆఫీసులకు చేరవేస్తున్నారని, తద్వారా పాఠకులు, వీక్షకులు త్వరగా సమాచారాన్ని తెలుసుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications