బాలయ్యకు చెక్: జూ ఎన్టీఆర్ పావు హరికృష్ణ!?

ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండటంతో ఇప్పట్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికే పార్టీలో తమ ఆధిపత్యం కొరవడిందని భావిస్తున్న హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు తమకు అనుగుణంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. హరికృష్ణ కృష్ణా జిల్లా గన్నవరం నుండి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ ఆలోచన వెనుక పార్టీలో తమ పట్టు సాధించుకోవడం కోసమేనంటున్నారు.
ప్రస్తుతానికి జూనియర్ రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. దీంతో హరికృష్ణనే స్వయంగా బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నారట. బాలయ్య టిడిపికి పెట్టింది పేరైన కృష్ణా జిల్లా నుండి పోటీకి ఆసక్తి చూపుతున్నారట. పెనమలూరు నుండి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో హరికృష్ణ కూడా అదే జిల్లాలోని గన్నవరం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారట. అదే నియోజకవర్గం నుండి జూనియర్ సన్నిహితుడు వల్లభనేని వంశీ పోటీ చేసేందుకు పట్టుబడుతున్నారు.
హరికృష్ణ బరిలోకి దిగుతానంటే ఇటు వంశీ అటు సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరిలు కాదనలేని పరిస్థితి ఉంటుంది. వంశీ ఎలాగు జూనియర్ సన్నిహితుడి కాబట్టి ఆయనకు చెప్పి మరో స్థానాన్ని కేటాయించే అవకాశాలు లేకపోలేదు. తద్వారా టిడిపికి పట్టున్న కృష్ణాలో తమ వర్గాన్ని బలంగా చేయాలని హరికృష్ణ, జూనియర్‌లు భావిస్తుండవచ్చునని అంటున్నారు. ఇప్పటికే హరి గన్నవరంపై ఆరా తీస్తున్నారట.
సన్నిహితుడు వంశీ పోటీ పడుతుండటంతో జూనియర్ తండ్రి పోటీకి అంగీకరిస్తారా? అనే ప్రశ్న తలెత్తుతున్నా.. అసలు జూనియర్‌తో సంప్రదించకుండా హరికృష్ణ ఎలా ముందడుగు వేస్తారని ప్రశ్నించే వారు లేకపోలేదు. బాలయ్య, లోకేష్‌ల ఆధిపత్యానికి ధీటుగా హరికృష్ణ, జూనియర్‌లు పావులు కదిపే దిశలోనే ఇది కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications