హరి పావయ్యారా: ఆగ్రహం, టిడిపి బుజ్జగింపు!

ఈ సమావేశంలో విభజన, కాంగ్రెసు పార్టీ వేసే కొత్త కమిటీ అంశాలతో పాటు హరికృష్ణ రాజీనామా ఆమోదం అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ సమయంలో హరికృష్ణ సహచర ఎంపీలపై ఒకింత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఓ దశలో మోదుగుల ఇంట్లో జరిగిన టిడిపి ఎంపీల భేటీ హాట్ హాట్‌గా మారిందట. రాజీనామాల విషయంలో తలోదారి కావడంపై హరికృష్ణ తోటి ఎంపీలను నిలదీసినట్లుగా తెలుస్తోంది.
నిర్ణయాలతో తాను ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన చెందారట. ఈ సమయంలో మిగతా ఎంపీలు హరికృష్ణను శాంతింప చేసినట్లుగా సమాచారం. రాజీనామా చేయడం, ఆ వెంటనే ఆమోదించడంతో హరికృష్ణ ఒకింత అసంతృప్తితో ఉన్నారట. దీంతో ఆయన అందరు కలిసి రాకపోవడంపై సహచర ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో... వారు కూల్ చేశారట. దీంతో ఆయన తగ్గినట్లుగా సమాచారం.
హరికృష్ణ రాజీనామా, ఆమోదం నేపథ్యంలో వివిధ రకాల ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన రాజీనామా లేఖను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలే రాశారని, కాంగ్రెసు పార్టీకి ముందస్తు సమాచారం ఉన్నందునే ఆమోదించి ఉంటారని, వెనుక కేంద్రమంత్రి పురంధేశ్వరి హస్తం ఉందనే ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications