వాపు - బలుపు: జూ.ఎన్టీఆర్‌ది అద్దె బలమా?

Jr Ntr
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాపును చూసి బలుపు అనుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో ఓ దుకాణ ప్రారంభోత్సవం సందర్భంలో, రెండు రోజుల క్రితం జరిగిన బాద్ షా ఆడియో సందర్భంలో జూనియర్ తన బలాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, హీరో నందమూరి బాలకృష్ణకు చూపించాలని భావించి ఉంటారని అంటున్నారు.

పార్టీపై పట్టు సాధించే అవకాశం తనకు ఇవ్వకుండా తన తనయుడు లోకేష్‌కు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా.. బాబు వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఎన్టీఆర్ ఫ్లెక్సీపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన బలాన్ని తన మావయ్యకు చూపించే ప్రయత్నాలు చేశారంటున్నారు. అందులో భాగంగా అభిమానులను సమీకరించి ఉండవచ్చుననే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా హీరోలు, హీరోయిన్లు దుకాణాల ప్రారంభోత్సవానికి వెళ్తున్నప్పుడు భారీగా అభిమానులు వస్తుంటారు. చిన్న చిన్న హీరో, హీరోయిన్లను చూసేందుకు కూడా జనాలు తరలి వస్తుంటారు. కానీ, శనివారం విజయవాడలో ఎన్టీఆర్‌ను చూసేందుకు వచ్చిన అభిమాన గణాన్ని చూస్తుంటే ఉద్దేశ్య పూర్వకంగా సమీకరించి ఉంటారనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కూడా దుకాణ ప్రారంభోత్సవానికి మాత్రమే కాకుండా బల ప్రదర్శన చేసినట్లుగా కనిపించిందని అంటున్నారు.

బాద్ షా ఆడియో సందర్భంగా కూడా ఎన్టీఆర్ బల ప్రదర్శన చేసినట్లుగా భావిస్తున్నారు. అడియో వేడుకతో పాటు అది బల ప్రదర్శనకు వేదికగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా అద్దె బలమే అని అంటున్నారు. అద్దె బలం అంటే.. నందమూరి అభిమాన గణమే జూనియర్ వెంట ఉందంటున్నారు. నందమూరి కుటుంబం పేరు చెప్పి పైకి వచ్చిన ఎన్టీఆర్ వెంట ఇప్పుడు అదే నందమూరి కుటుంబంపై తొడ కొట్టడాన్ని పలువురు నందమూరి అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారట.

నందమూరి కుటుంబం అండదండలతో ఎదిగిన జూనియర్ ఇప్పుడు కొంత అభిమాన గణాన్ని సంపాదించుకొని ఉండవచ్చుని కానీ, నందమూరి ఫ్యామిలీ కారణంగా ఎదిగిన విషయాన్ని మర్చిపోతే మాత్రం అది ఆయనకే చేటు అంటున్నారు. టిడిపిలో పట్టు కోసం ఆయన ప్రయత్నించ వచ్చు. కానీ ఆయన ఎన్నుకున్న దారి మాత్రం సరైనది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీకి వచ్చిన ప్రారంభంలో చంద్రబాబు, బాలయ్య, తాత పేర్లు నిత్యం ప్రస్తావించిన ఎన్టీఆర్ ఇప్పుడు తాత పేరు మాత్రమే ప్రస్తావిస్తున్నారని, ముందు ముందు దానిని విస్మరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+