వైయస్ వివేకా ఒంటరి: జగన్‌కు దూరంగా..!?

YS Vivekananda Reddy-YS Jagan
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ఒంటరి అయ్యారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. వైయస్ మృతి తర్వాత తనపై, తన కుటుంబంపై కాంగ్రెసు పార్టీ కక్ష సాధింపుకు పాల్పడుతోందని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వేరు కుంపటి పెట్టారు. జగన్ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెసు పార్టీ నుండి పలువురు ఆయనకు మద్దతుగా నిలిచారు. కానీ జగన్ సొంత చిన్నాన్న అయిన వైయస్ వివేకానంద మాత్రం కాంగ్రెసు పార్టీలోనే ఉండిపోయారు. తాను జగన్ పార్టీలోకి వెళ్లనని, తన అన్నలాగే ఎప్పుడూ కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. ఆ తర్వాత వ్యవసాయశాఖ మంత్రి అయ్యారు.

పులివెందుల ఉప ఎన్నికల నేపథ్యంలో వదిన వైయస్ విజయమ్మ పైన పోటీకి దిగి ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వైయస్ పేరు ఛార్జీషీటులో పెట్టడంతో జగన్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెసు పార్టీని వీడి తనయుడు వైపుకు వెళ్లారు. ఆయన పార్టీలోకి వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అంతగా ప్రాధాన్యం లభించడం లేదనే వాదనలు మొదటి నుండి వినిపిస్తున్నాయి. వివేకానంద ఆపద సమయంలో రాలేదని భావనలో ఆ పార్టీ క్యాడర్ ఉందట. పార్టీ అధ్యక్షుడి మదిలో కూడా ఆదే ఆవేదన ఉందని అంటున్నారు.

అందుకే జగన్‌తో పాటు పార్టీ నేతలు ఆయనకు అంతగా ప్రధాన్యత ఇచ్చినట్లుగా కనిపించడం లేదంటున్నారు. పార్టీలో ఆయనకు ప్రాధాన్యత లేకపోవడంతో కొంతకాలం క్రితం వరకు అప్పుడప్పుడు కనిపించారని, ఇటీవల ఆ ప్రాధాన్యత మరింత తగ్గడంతో అసలే కనిపించడం లేదని అంటున్నారు. పార్టీలో ఇంపార్టెన్సు లేకపోవడంతో వైయస్ వివేకా కూడా అంతేదూరంగా ఉండాలనే భావనతో ఉన్నట్లుగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+