జగన్‌కు జైలు కష్టాలు: పార్టీలో 'తీహార్' బెంగ!

ఈ నేపథ్యంలో ఇటీవల పలువురు నేతలు జగన్‌ను చంచల్‌గూడ జైలు నుండి మరో రాష్ట్రానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు రెండు రోజుల క్రితం మాట్లాడుచూ... జగన్‌ను మరో రాష్ట్ర జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు. జగన్‌ను చంచల్‌గూడ జైలు నుండి తీహార్ జైలుకు తరలించాలని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ మంగళవారం డిమాండ్ చేశారు.
మంత్రుల విమర్శలతో పాటు జైలును మార్చాలనే డిమాండ్లు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌ను తీహార్ లేదా మరో జైలుకు తరలించనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. దీంతో ఏమవుతుందోననే ఆందోళన జగన్ పార్టీలో ప్రారంభమైందని అంటున్నారు. జైల్లోను జగన్ ములాకత్‌ల పైనా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నావనే కారణంతో ఆయనను నిజంగానే మరో జైలుకు తరలించే పరిస్థితి వస్తుందేమోనని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే జైలులో ఉండటం వల్ల పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారయిందని, ఇక్కడి జైలులో ఉన్నందువల్ల ములాకత్‌లలో పార్టీ విషయాలు చర్చిస్తూ కొద్దిగా నెట్టుకొస్తున్నారని, మరో రాష్ట్ర జైలుకు తరలిస్తే ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బెయిల్ పైన జగన్ విడుదలవుతారని పార్టీ గట్టిగా భావిస్తోంది. ఆలాకాకుండా జైలునే మార్చితే అసలుకే మోసం వస్తుందనే ఆందోళనలో ఉన్నారట.












Click it and Unblock the Notifications