రాజకీయాలపై జైపాల్ రెడ్డికి వైరాగ్యం

రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడం వల్ల రాజకీయేతర జీవితాన్ని చాలా కోల్పోతున్నానని జైపాల్ రెడ్డి న్నారు. శుక్రవారం చెన్నైలో జరిగిన ఎన్ఆర్ చందూర్ జగతి పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాసే వార్తల్లో సమాచారంతో పాటు వినోదం కూడా కలగలిపి ఉండాలని ఆయన ఓ సలహా పారేశారు. ప్రస్తుతం ఆ వాతావరణం కనిపించదడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వార్తల్లో అసలు సమాచారం ఉండడం లేదని, కేవలం వినోదం మాత్రమే కనిపిస్తోందని ఆయన విశ్లేషించారు. సంచనాలకు మీడియా ప్రాధాన్యం ఇస్తోందని ఆయన చెప్పారు. రాజకీయాల్లో తల పండిన నేతగా జైపాల్ రెడ్డికి పేరుంది.
కానీ, ఇటీవలి కాలంలో ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో డిమోషన్ వచ్చింది. తెలంగాణ సమస్య కారణంగానే ఇది జరిగిందనే వార్తలు వచ్చాయి. ఆయన ఇటు తెలంగాణకు, అటు కాంగ్రెసు అధిష్టానానికి కాకుండా పోయారు. దీంతో జైపాల్ రెడ్డికి వైరాగ్య భావనలు రాక ఏమవుతాయి....












Click it and Unblock the Notifications