జగన్‌కు ఝలక్: తెరాసలో జలగం వెంకట్రావు ?

జలగం వెంకటరావు అనుచరులు షర్మిల సభకు వచ్చి ఆయనకు అనుకూలంగా నినాదాలు చేయడంతో షర్మిల తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. తనకు వైయస్సార్ కాంగ్రెసులో తగిన ప్రాధాన్యం లభించడం లేదని జలగం వెంకటరావు భావిస్తున్నట్లు సమాచారం.
కాగా, ఖమ్మం జిల్లాలో తెరాసకు అంతగా బలం లేదు. జలగం వెంకటరావు చేరితే తెరాస ఆ జిల్లాలో బలపడే అవకాశం ఉంది. తెలంగాణవాదం ఖమ్మం జిల్లాలో తక్కువగా ఉందని అంచనాలు సాగుతున్నాయి. ఆ ఉద్దేశంతోనే నిరాహారదీక్ష చేస్తున్న కెసిఆర్‌ను అరెస్టు చేసి అప్పట్లో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కానీ, అందుకు విరుద్ధమైన ప్రతిస్పందన లభించింది.
జలగం వెంకటరావు గతంలో కాంగ్రెసులో ఉండేవారు. రేణుకా చౌదరి కాంగ్రెసు నేతగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత జలగం కుటుంబానికి ప్రాధాన్యం తగ్గిందని అంటారు. ఏమైనా, జలగం వెంకటరావు తెరాసలో చేరితే సమీకరణాలు మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications