వైయస్ జగన్ పార్టీలోకి జయప్రద?

Jayaprada
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు, సినీ నటి జయప్రదకు రాష్ట్ర రాజకీయాల విషయంలో క్లారిటీ వచ్చినట్లుంది. రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న ఆమెకు దారి దొరికినట్లు కనిపిస్తోంది. ఆమె సోమవారం చేసిన వ్యాఖ్యలు ఆ విషయంలో కొన్ని సంకేతాలను ఇస్తున్నాయి. ఆమె వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. రాజమండ్రి నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలో తాను చేరబోరని ఆమె మాటలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ విషయంలో ఆమె అధికార కాంగ్రెసు పార్టీని తప్పు పట్టారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి సినీ తారలను వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేయడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, ఎస్పీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌కు అలవాటు అని ఆమె చురకలు అంటించారు.

తెలంగాణపై కాంగ్రెసు నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, అవుననో కాదనో చెప్పాలని ఆమె అన్నారు. దీన్ని బట్టి ఆమె కాంగ్రెసును కూడా పక్కన పెట్టినట్లే. ఈ రకంగా చూస్తే, ఆమె వైయస్ జగన్ పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారు.

జయప్రద వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు గతంలో కూడా ప్రచారం సాగింది. అయితే, ఆ తర్వాత ఎందుకో ఆ ప్రచారం సమసిపోయింది. ఆ తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలో చేరడానికి తిరిగి ప్రయత్నాలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అది కూడా ఫలించలేదని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆమెకు చోటు లేకపోవడంతో తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలంటే జగన్ పార్టే సరైందిగా ఆమెకు కనిపించినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+