జూ. ఎన్టీఆర్‌కు వాస్తు పీడ: ఇంటికి మార్పులు?
హైదరాబాద్: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు ఇటు సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ కలిసి రావడం లేదు. సినిమాలు వరుసగా బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న రామయ్యా వస్తావయ్యా విజయాన్ని అందించలేకపోయింది. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, బాబాయ్ బాలయ్యకు దూరమయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను కాదని చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పార్టీ పగ్గాలను చేజిక్కించునే పనిలో పడ్డారు. తన పరిస్థితికి కారణాలు వెతుక్కునే పనిలో పడిన జూనియర్ ఎన్టీఆర్ అసలు విషయాన్ని గుర్తించారట. ఆయన ఇంటి వాస్తు సరిగా లేదని వాస్తు నిపుణులు తేల్చి చెప్పారని వినికిడి.

తన కొత్త ఇంటి వాస్తు బాగా లేకపోవడం వల్లనే విజయాలు అందడం లేదని ఆయన భావించారట. దీంతో ఆయన తన ఇంటి వాస్తును మార్చే పనిలో పడ్డారని సమాచారం. వాస్తు ప్రకారం చేర్పులు మార్పులు జరిగిపోతున్నాయని చెబుతున్నారు. గత వారం రోజులుగా ఈ పనులు జరుగుతున్నాయట.
పూజా మందిరాన్ని, పడక గదిని మార్పు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వాస్తు శాస్త్రంలో నిపుణుల సలహాలు తీసుకుని జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి మార్పులు చేసే పనిలో ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications