వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో పొలిటిక్స్: మహేష్, పవన్ దారిలో జూ.ఎన్టీఆర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ చరిష్మాకు కొదవేమీ లేదు. స్ట్రామినాకు కూడా తక్కువ లేదు. డ్యాన్స్‌ల్లో, ఫైట్స్‌లో అదరగొట్టే జూనియర్ ఎన్టీఆర్‌కు సినిమా విషయంలో సక్సెస్ అందిన ద్రాక్షగానే మారుతోంది. రామయ్యా వస్తావయ్యా సినిమాపై ఆయన తెగ ఆశలు పెట్టుకున్నట్లే ఉన్నారు. కానీ అది బాక్సాఫీసు వద్ద దాదాపుగా బోర్లా పడింది.

మరో వైపు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు పథకం ప్రకారం సినిమాల్లో దూసుకుపోతున్నారు. ఈ ముగ్గురు హీరోలకు భలే క్రేజ్ ఉంది. రాజకీయాల్లోకి వస్తారనే పుకార్లకు వీరు ఎప్పుడూ సన్నిహితంగా ఉంటారు. కానీ, పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం దెబ్బతో పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన సినిమాలపై దృష్టి పెట్టారు. వరుసగా విజయాలు సాధిస్తూ తన పవర్‌ను చాటుతున్నాడు. గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది సినిమాలు పవన్ కళ్యాణ్‌ను అగ్రస్థానంలో నిలిపాయి.

Jr NTR

మహేష్ బాబు విషయం చెప్పనే అక్కర్లేదు. చేసిన ప్రతి సినిమా దాదాపుగా విజయాన్ని అందుకుంటోంది. దాంతో మహేష్ బాబు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. రాజకీయాలకు ఆయన దూరంగానే ఉంటున్నారు. కానీ సమస్యంతా జూనియర్ ఎన్టీఆర్‌కే వస్తోంది. లోపం ఎక్కడుందనే విషయాన్ని ఆయన కనిపెట్టలేకపోతున్నారా, మరేదైనా ఉందా అనేది తెలియదు. అయితే, మంచి దర్శకుడు, కథా రచయిత దొరికితే జూనియర్ ఎన్టీఆర్ విజయం సాధిస్తాడని అంటున్నారు.

అయితే, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారం మధ్య మధ్యలో జరుగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి, బాబాయ్ బాలకృష్ణకు ఆయన పూర్తిగా దూరమైనట్లేనని భావిస్తున్నారు. ఈ స్థితిలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మాదిరిగా రాజకీయాల గురించి ఆలోచించకుండా సినిమాలపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని ఆయన అనుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

English summary
It is said that Nandamuri hero Jr NTR will follow prince Mahes babu and power star Pawan Kalyan as for as politics is concerned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X